సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కన్నడ సినిమాలో సాయిపల్లవి
  • బన్నీ చిత్రంలో బాలీవుడ్ నటుడు 
  • నాట్యం నేర్చుకుంటున్న కథానాయిక
*  ఇప్పటికే దక్షిణాదిలోని తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలలో నటిస్తున్న కథానాయిక సాయిపల్లవి కన్నడ భాషలో కూడా నటించడానికి ఓకే చెప్పింది. ప్రముఖ దర్శకుడు ప్రేమ్ (నటి రక్షిత భర్త) దర్శకత్వంలో రూపొందే కన్నడ చిత్రంలో ఆమె కథానాయికగా నటించనుంది. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ చిత్రంలో దర్శకుడు ప్రేమ్  తన బావమరిదిని హీరోగా పరిచయం చేయనున్నాడు.
*  అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ భారీ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం.
*  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ గా రూపొందే 'తలైవి' చిత్రంలో హిందీ నటి కంగన రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించే ఈ చిత్రం కోసం కంగన ప్రస్తుతం భరతనాట్యం నేర్చుకుంటోందట.   
Go Back to Shorts
SaiPallavi
Allu Arjun
Trivikram
kangana

More Telugu News